రజనీకాంత్ "కబాలి" తెలుగు టైటిల్ టెన్షన్
on Oct 5, 2015

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం "కబాలి". ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న రజనీ ఫ్యాన్స్ కి భోజనం ముందు స్వీట్ లా తన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాని ఒక్క తమిళ ప్రేక్షకులే కాదు ఇటు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కేంటంటే ఈ సినిమాకి తమిళంలో "కబాలి" అని పేరు పెట్టారు.. కానీ తెలుగులో ఏం పేరు పెట్టాలని ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది దర్శక నిర్మాతలకి. అయితే గతంలో రజనీకాంత్ సినిమాలు "బాషా".. "ముత్తు" ఇటు తెలుగులో కూడా అవే టైటిల్స్ తో వచ్చి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు అలాగే ఈ సినిమాకి తెలుగులో కూడా "కబాలి" అనే పెట్టాలని ఆలోచిస్తున్నారట. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇంకా ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న ఈ చిత్రాన్నివిడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



