సమంత ఫుల్ గా డామినేట్ చేసేసింది..!
on Jun 7, 2016
అ ఆ సినిమాకు హీరో ఎవరు..? మామూలుగా అయితే నితిన్ అని చెప్పాలి. కానీ సినిమా సరిగ్గా చూసిన వాళ్లందరూ హీరో సమంత అని చెబుతారు. అలా అనడానికి కారణం లేకపోలేదు. సినిమాలో సమంత పాత్ర అంత బలంగా ఉంటుంది. దర్శకుడు ఏ పాత్ర కోణం నుంచి కథను చూస్తాడో, ఆ క్యారెక్టర్ చుట్టూనే మూవీ అంతా తిరుగుతుంటుంది. త్రివిక్రమ్ అ ఆ కథను పూర్తిగా అనసూయ పాత్ర కోణం నుంచే రాసుకున్నాడు. కాబట్టి ఆ పాత్ర తప్ప మిగిలిన క్యారెక్టర్స్ ఏవీ కనపడవు. ఈ ప్రాసెస్ లో తెలుగులో తొలిసినిమా చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ రోల్ కూడా కొట్టుకుపోయింది. సినిమాలో ఆమె రోల్ కు సరైన జస్టిఫికేషన్ కూడా కనబడదు. సమంత పాత్రకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది ఆమె క్యారెక్టర్. మళయాళ ప్రేమమ్ తో కుర్రకారు మనసులు దోచుకున్నా, తెలుగులో మాత్రం ఈ మళయాళ భామ సైడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్టే లెక్క. ఇక తర్వాత నాగచైతన్యతో రాబోతున్న ప్రేమమ్ పైనే అనుపమ ఆశలన్నీ ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



