English | Telugu

ఇంతమంది బుర్రలేనివాళ్ళా?: అనసూయ అతి!

on Mar 23, 2020

 

యాంకర్ (ఈటీవీ 'జబర్దస్త్') కమ్ యాక్టర్ (సినిమాలు) కమ్ షో జడ్జ్ (జీ టీవీ 'లోకల్ గ్యాంగ్స్')... అనసూయ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు కమ్ చెప్పాలో. అనసూయ క్రేజ్, పాపులారిటీ, సంపాదన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమెకు లక్షలు విలువ చేసే ఆడి కారు ఉంది. 'జబర్దస్త్' షోలో ఆమె 'ఆడి' కార్ మీద ఎన్ని పంచ్ డైలాగులు పడ్డాయో! మొన్నీ మధ్య ఒక స్కిట్‌లో "నీకేంటి అమ్మా... ఈవెంట్‌కి మూడు లక్షలు. మూడు అంతస్తుల మేడ కడతావ్. మాకు ఒక లక్ష మాత్రమే" అని హైపర్ ఆది పంచ్ వేశాడు. అటువంటి అనసూయ తనకు ఇన్‌కమ్ లేదని అంటోంది. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, ఈఎంఐ ఎలా కట్టాలో అని ట్విట్టర్‌లో వాపోయింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సందర్భంగా అనసూయ ఒక ట్వీట్ చేసింది. "ప్రభుత్వంపై గౌరవంతో ఆదేశాలను పాటిస్తాం. కొంతమంది ప్రొఫెషనల్స్... మేం పనికి వెళ్లకపోతే గానీ మాకు ఆదాయం ఉండదు (డబ్బులు రావు). కానీ, ప్రతి నెల తప్పనిసరిగా కొన్ని ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు... ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, ఈఎంఐ వగైరా వగైరా. అటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని మనవి" అని అనసూయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అది చూసి అవాక్కవ్వడం ప్రేక్షకుల వంతు అయింది. 

'జబర్దస్త్' షోలో టీమ్ లీడర్లు కూడా ఫ్లాట్స్ కొనుక్కున్నారు. ఏడాది, రెండేళ్ల క్రితం వచ్చిన టీమ్ లీడర్లు ఫ్లాట్స్ కొన్నప్పుడు... షో స్టార్టింగ్ నుండి యాంకరింగ్ చేస్తున్న అనసూయకు సొంత ఇల్లు తప్పకుండా ఉండి ఉంటుంది కదా! అందులోనూ ఆమె 'జబర్దస్త్' షో ఒక్కటే చేయడం లేదు. సినిమాల్లో నటిస్తోంది. జీ టీవీలో ప్రోగ్రామ్స్ చేస్తోంది. రెండు చేతులా సంపాదిస్తోంది. ఒక్క పది రోజులు లాక్ డౌన్ చేస్తే... కరెంట్ బిల్లు కట్టలేనని ట్వీట్ చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఆడి కారు కొనుకున్న ఆమె దగ్గర... పది రోజులు పని చేయకపోతే ఈఎంఐ కట్టే డబ్బులు ఉండవా? అందుకని, "అనసూయ అతికి అంతు లేదా?" అంటూ సెటైర్స్ వేశారు. 

"ఈవిడే (అనసూయ) ఇలా అంటే... మా మిడిల్ క్లాస్ ఎందులో అయినా దూకాలి" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి "సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి" అని అనసూయ బదులు ఇచ్చారు. ఇంకా చాలామంది ఆమెపై కామెంట్స్ చేశారు. అయినా... అనసూయ ఏం తగ్గలేదు. "నా మేకప్ మాన్, హెయిర్ స్టయిలిస్ట్, నా అసిస్టెంట్, ఆఖరికి నాకు కూడా షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. లేదంటే లేదు. ఒకటో తారీఖు వస్తే బిల్ కలెక్టర్లు దీన్ని పరిగణలోకి తీసుకుంటారా?" అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు... తన వాదన గట్టిగా వినిపించారు.  

చివరకు... "అయ్యబాబోయ్... ఏంటి ఇంతమందా? ఇంతమంది బుర్రలేనివాళ్ళా... ఇంతమంది వింతండవాదులా? నేను 'మేము' అంటే 'నేను' అనేసుకుని... ఏం చేస్తాం లెండి. సెన్స్ అనేది కామన్‌గా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను భయపడేది రాబోయే పరిస్థితుల గురించి. అర్థం చేసుకునేవారు (చేసుకోండి)" అని ట్వీట్ చేశారు. ఈ పది రోజుల్లో నెలన్నరకు సరిపడా షూటింగ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయని మధ్యలో ఒక ట్వీట్ చేశారు. ఆమె అసలు బాధ ఆ షూటింగులు క్యాన్సిల్ అయ్యాయని అనుకుంటా...


Cinema GalleriesLatest News


Video-Gossips