'ఫీలింగ్ బెటర్' అని చెప్పిన కరోనా బాధిత టాప్ యాక్టర్!
on Mar 23, 2020
.jpg)
హాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకరైన టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ కరోనా పాజిటివ్‌గా కొద్ది రోజుల క్రితం తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాము బాగానే ఉన్నామని ఆదివారం రాత్రి టామ్ హాంక్స్ ట్వీట్ చేశాడు. లక్షణాలు బయటపడిన రెండు వారాల తర్వాత 'వియ్ ఫీల్ బెటర్' అని ఆయన పోస్ట్ చేశాడు.
సామాజిక దూరం (సోషల్-డిస్టాన్సింగ్) విషయంలో ఆయన ప్రజలను ప్రోత్సహించాడు. "ఎవరికీ దానిని మీరు ఇవ్వొద్దు, ఎవరి నుంచీ మీరు దాన్ని పొందవద్దు. మనం ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకుంటే, చేయగలిగిన సాయం చేస్తే, కొన్ని సౌకర్యాలను వదులుకుంటే, బాగుంటుంది" అని ఆయన రాసుకొచ్చాడు. మార్చి 12న తాను, రీటా కరోనావైరస్ పాజిటివ్‌గా టెస్ట్‌లో తేలిందని హాంక్స్ ప్రకటించాడు. పోయిన సోమవారం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఆస్ట్రేలియాలోని ఒక అద్దె ఇంట్లో స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తోన్న ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లాడు హాంక్స్. బజ్ లుర్‌మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ప్రెస్లీ మేనేజర్ కల్నల్ టామ్ పార్కర్ క్యారెక్టర్‌ను హాంక్స్ పోషిస్తున్నాడు. ఆయనకు కరోనా సోకిన తర్వాత షూటింగ్‌ను నిలిపివేశారు. యు.ఎస్.లో కానీ లేదా ఆస్ట్రేలియాకు ప్రయాణించే సమయంలో కానీ హాంక్స్ దంపతులకు కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



