ఈ మెగా హీరో సినిమాల్లో కన్నా యాంకరింగే బెటర్
on Jul 1, 2017
.jpg)
ఇంకా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ సంపాదించుకోవడంలో విఫలమయిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇప్పటికీ అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ కి తమ్ముడిగానే మిగిలిపోయాడు. హిట్ వల్ల వచ్చే క్రేజ్, మజా ఎలా ఉంటుందో శిరీష్ ఇంకా రుచి చూడ లేదు. అయితే, హీరోగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు సాగుతున్నా, ఒక విషయంలో మాత్రం తాను తోపు అని ప్రూవ్ చేసుకున్నాడు శిరీష్. అది ఎందులో అంటారా? యాంకరింగ్ అండీ బాబూ. అలా అని చెప్పేసి శిరీష్ టీవీల్లో యాంకర్ గా ఏం చెయ్యట్లేదు. కానీ, కొన్ని అవార్డు ఫంక్షన్లనో యాంకరింగ్ చేసినప్పుడల్లా అందర్నీ కడుపుబ్బా నవ్వించడంలో సఫలమవుతున్నాడు. సిట్యుయేషన్ బట్టి పంచ్ డైలాగ్ లు వదులుతూ తానేం తక్కువోడిని కానని నిరూపించుకుంటున్నారు. నిన్న దుబాయ్ లోని అబూ దాబి లో జరిగిన సైమా అవార్డు ఫంక్షన్ కి అల్లు శిరీష్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మెగాభిమానుల్ని మరింత దగ్గర చేసుకునే క్రమంలో శిరీష్ బ్రాహ్మణ అవతారం అదేనండీ వాళ్ల అన్నయ్య అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జగన్నాధం గెటప్ లో వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేసాడు. ఈ ప్రోగ్రాం చూసిన వాళ్లంతా శిరీష్ యాంకరింగ్ సూపరో సూపర్ అని కితాబిస్తున్నారు. విఐ ఆనంద్ సినిమాతో హిట్ కొట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్న శిరీష్ యాంకరింగ్ పైన కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా లాంటి స్టార్లే యాంకరింగ్ రంగంలో దిగారు. సో, యాంకరింగ్ చేయడం తమని తాము తగ్గించుకోవడం ఎంత మంత్రం కాదు. మీరేమంటారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



