పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కార్తీ...
on Jul 1, 2017
.jpg)
తమిళ యంగ్ హీరో కార్తీ అటు తమిళంలోనే కాదు.. ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరే తెచ్చుకున్నారు. తాను చేసే సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు కార్తీ. తమిళ్లో ధీరన్ అధిగరమ్ ఓండ్రు పేరుతో కార్తీ కొత్త సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను కూడా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే తెలుగులో ఈ సినిమా పేరు "ఖాకీ" గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో కార్తీ ఖాకీ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్నాడు.ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాతో ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



