స్నేహకు బన్నీ విషెస్.. "మరెన్నో బర్త్డేస్ను నీతో స్పెండ్ చేయాలనుకుంటున్నా క్యూటీ"!
on Sep 29, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి లవ్ స్టోరీతో ఓ మంచి నవల రాయొచ్చు, ఓ సినిమా తీయొచ్చు. భావోద్వేగాల విషయంలో భిన్న ధ్రువాలైన ఆ ఇద్దరూ పరస్పరం ఆకర్షితులై, ప్రేమలో పడి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్ 29 మంగళవారం అల్లు స్నేహారెడ్డి 33వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఎమోషన్స్‌ను దాచుకొనే అలవాటు ఏమాత్రంలేని బన్నీ తామిద్దరూ ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్చర్‌ను షేర్ చేసి, తన ప్రియమైన భార్యకు విషెస్ తెలిపాడు.
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న స్నేహ పిక్చర్‌ను షేర్ చేసిన బన్నీ, "నా లైఫ్‌లో మోస్ట్ స్పెషల్ పర్సన్‌కు many many happy returns of the day.. మరిన్ని మరిన్ని బర్త్డేస్ను నీతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. Happy birthday cutieeee... #allusnehareddy" అంటూ క్యూట్ విషెస్ తెలిపాడు. పిక్చర్‌లోని లైటింగ్‌ని బట్టి చూస్తుంటే అది అర్ధరాత్రి 12 గంటలు దాటి 29వ తేదీ రాగానే జరిపిన బర్త్‌డే వేడుక అని అర్థమవుతోంది.
కొన్నేళ్ల క్రితం ఒక ఫ్రెండ్ పెళ్లికి యు.ఎస్. వెళ్లిన బన్నీ అక్కడ తారసపడిన స్నేహకు తొలిచూపులోనే మనసిచ్చేశాడు. స్నేహ అంతకుముందు అర్జున్ గురించి విని ఉంది కానీ, అతని సినిమాలేవీ చూసిన జ్ఞాపకం లేదు. మెసేజ్‌ల ద్వారా పెరిగిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తనయుడి ప్రేమ వ్యవహారం అల్లు అరవింద్ కనిపెట్టేశారు. తండ్రికి దాపరికం లేకుండా తన ప్రేమ విషయం చెప్పేశాడు బన్నీ.
మొదట కొంత వ్యతిరేకించినా, బన్నీ పట్టుదల, అతని ప్రేమలోని నిజాయితీ గ్రహించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అరవింద్. 2010 నవంబర్ 26న నిశ్చితార్ధం జరగగా, 2011 మార్చి 6న దంపతులుగా మారారు బన్నీ, స్నేహ. అప్పట్నుంచీ వారి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. వారి అనురాగానికి చిహ్నాలుగా కొడుకు అయాన్, కూతురు అర్హ పుట్టారు.
Also Read