నరేంద్ర మోడీని కాకా పడుతున్న స్టార్ హీరో
on Feb 6, 2018
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కు ఒక ప్రత్యేకమయిన స్టైల్ ఉంది. సినిమా, సినిమాకి వేరియేషన్ ఉండేలా జాగ్రత్త వహిస్తుంటాడు. మొన్న టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అంటూ అందర్నీ కడుపుబ్బా నవ్వించిన అక్షయ్, ఇప్పుడు ప్యాడ్ మ్యాన్ అవతారం ఎత్తాడు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ గురించి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గొప్పగా మాట్లాడడం విశేషం. తన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ని ప్రమోట్ చేసేలా ఉందని అక్షయ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు మోడీ. మరొకసారి, మన పీఎం మెప్పుపొందే పనిలో పడ్డాడు అక్షయ్.
నరేంద్ర మోడీ మరియు సుష్మ స్వరాజ్ కోసం పాడ్ మ్యాన్ స్పెషల్ షో వేయనున్నాడట అక్షయ్. ఈ సినిమా చూసేందుకు మోడీ మరియు సుష్మ స్వరాజ్ కూడా ఒకే చెప్పారట. ఈ నెల 9 న ప్యాడ్ మ్యాన్ విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రం ఆవిష్కర్త అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ప్యాడ్ మ్యాన్. బాల్కి దర్శకత్వం వహించిన ప్యాడ్ మ్యాన్ లో అక్షయ్ కుమార్ సరసన సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటించారు. బాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పటికే తమ వంతుగా ప్యాడ్ మ్యాన్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక నరేంద్ర మోడీ కూడా సినిమా చూసి నచ్చిందని కితాబిస్తే, కలెక్షన్ల వర్షం ఖాయం.