పవన్ 'తమ్ముడు' కామెంట్ పై స్పందించిన మోహన్ బాబు
on Feb 6, 2018
.jpg)
అవి మెగా బ్రదర్స్ ఒకరికి ఒకరు సఖ్యతగా ఉన్న రోజులు. అన్నయ్య చిరంజీవి ని ఎవరు ఏమన్నా, తనదయిన స్టైల్ లో సమాధానం ఇచ్చేవాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. అలాంటి సమయంలో తెలుగు చిత్ర సీమ వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు చిరంజీవికి లెజెండరీ యాక్టర్ పురస్కారం ఇవ్వడం జరిగింది. తనకు ఇవ్వలేదనో, లేక చిరంజీవి అందుకు అర్హుడు కాదనో, తన స్పీచ్ లో అక్కసు వెళ్లగక్కాడు మోహన్ బాబు. తాను కాలేజీ లో చదివే రోజుల నుండే చిరంజీవి సినిమాలు అంటే చాలా ఇష్టంగా చూసేవాడిని అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు కలెక్షన్ కింగ్.
అన్నయ్యని అంత మాటలు అనడం జీర్ణించుకోలేని పవన్ కళ్యాణ్, అప్పట్లో మోహన్ బాబు ని 'తమ్ముడు మోహన్ బాబు' అంటు సంభోదిస్తూ, సెటైర్లు విసిరాడు. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోహన్ బాబు దాదాపు పదేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి స్పందించాడు. మోహన్ బాబు మాట్లాడుతూ, ఆ విషయం ఎప్పుడో మరచిపోయానని... ఆ టైములో పవన్ కళ్యాణ్ స్పీచ్ ని ఎంజాయ్ చేసానని... తర్వాత అలా ఎందుకు అన్నాడో ఆలోచించానని... అయినా ఆ విషయాన్నీ పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ నెల 9 కి వస్తున్న గాయత్రి సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్న మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ విషయాన్నీ అంత తేలికగా తీసి పారేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



