అఖిల్ తో సినిమాకు ఎన్టీఆర్ డైరెక్టర్ ఓకే..?
on May 27, 2016
అక్కినేని అఖిల్ మొదటి సినిమా కోసం నాగార్జున చాలా ఆలోచించారు. చాలా మంది డైరెక్టర్లను స్కాన్ చేసిన తర్వాత గానీ, ఆయన వివి వినాయక్ కు కమిట్ అవలేదు. అయితే ఆ సినిమా కాస్తా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రెండో సినిమాకు నాగ్ జాగ్రత్త మరింత పెరిగిపోయింది. మొదటి సినిమా రిలీజై సగం సంవత్సరం కావస్తున్నా ఇంకా రెండో సినిమాను మొదలు పెట్టలేదు. చర్చలు మాత్రం చాలానే నడుస్తున్నాయి. మొదటి నుంచీ ఈ సినిమాకు వంశీ పైడిపల్లిని తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోజుకో దర్శకుడి పేరు వినబడింది. అయితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీస్తున్న కొరటాల శివ ను అఖిల్ తో సినిమాకు కమిట్ చేయించే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అంతా సెట్ అయితే డివివి దానయ్య నిర్మాణంలో అఖిల్, కొరటాల శివ తెరకెక్కే అవకాశం ఉంది.