ఇండియాలో జంగిల్ బుక్ వీర విహారం..!
on May 27, 2016
.jpg)
హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బాగా రన్ అవడం, భారీగా కలెక్ట్ చేయడం తక్కువగానే జరుగుతుంటుంది. అయితే జరిగిన ప్రతీసారీ చాలా భారీగా ఇండియన్ మార్కెట్స్ ను కొల్లగొడుతుంటాయి. టైటానిక్ తో మొదలైన హాలీవుడ్ వీరవిహారం, ఆ తర్వాత వరస గ్యాపుల్లో ఇండియన్ సినిమా మార్కెట్ లో కొనసాగుతూనే ఉంది. అవతార్ వచ్చి దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. గతేడాది వచ్చి వందకోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ సృష్టించింది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7. ఇక వీటన్నింటి రికార్డులను తిరగరాసేసింది జంగిల్ బుక్. రిలీజైన ఆరు వారాలకు 250 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయేలా చేసింది. జంగిల్ బుక్ కు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో మొదటిది భారతీయులందరికీ ఒకప్పుడు చాలా ఇష్టమైన టీవీ సీరీస్ ఇది. నవల రాసిన రుడ్యార్డ్ క్లిప్లింగ్ కూడా కథ అంతా భారతదేశంలోని అడవిలో జరుగుతున్నట్టుగా రాశాడు. వేసవి సీజన్లో పిల్లలకు సెలవులు కావడంతో దేశవ్యాప్తంగా పిల్లల్ని తీసుకుని పెద్దలు కూడా సినిమాకు క్యూ కట్టారు. ఇదే సినిమాకు భారీ కలెక్షన్లతో పాటు, లాంగ్ రన్ కూడా కారణమైంది. ఆరువారాల తర్వాత కూడా ఇంకా దేశవ్యాప్తంగా వంద స్క్రీన్లకు పైగా సినిమా రన్ అవుతుందంటేనే జంగిల్ బుక్ వీర విహారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా రన్ అవుతున్న నేపథ్యంలో కలెక్షన్లు ఎక్కడ ఆగుతాయో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



