అఖిల్.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్
on Jan 18, 2021
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను.. ఇలా వరుస పరాజయాలతో నిరాశపడ్డ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. విడుదలకు సిద్ధమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పైనే తన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సమ్మర్ లో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి రానుంది. ఈ లోపే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడీ అక్కినేని బుల్లోడు.
ఇదిలా ఉంటే.. సూరి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళకముందే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి అఖిల్ ఓకే చెప్పాడట. షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ చిత్రాలతో పాటు ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన రాజ్ - డీకే (రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే) దర్శకత్వంలో ఈ చిత్రం చేయబోతున్నాడట అఖిల్. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో అఖిల్ దర్శనమివ్వబోతున్నట్లు టాక్. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ ని అఖిల్ వదిన, ప్రముఖ కథానాయిక సమంత సెట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
రాజ్ - డీకే దర్శకత్వంలో రూపొందిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సామ్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో నటించారు. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.
త్వరలోనే అఖిల్, రాజ్ - డీకే కాంబో మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.