అఖిల్ డేటింగ్ చేస్తోంది ఈ ఫోటోలో వున్న అమ్మాయితోనే..!!
on Jun 28, 2016
అఖిల్ డేటింగ్ చేస్తోంది ఈ ఫోటోలో వున్న అమ్మాయితోనే..!!ఓ పక్క అన్నయ్య నాగచైతన్యకు సమంతకు పెళ్లి చేయడానికి తండ్రి నాగార్జున ఒప్పేసుకొన్నాడని తెలియగానే రెండో అబ్బాయి అఖిల్ కూడా తన ప్రేమ వ్యవహారంలో ఓపెన్ అయిపోయినట్లు తెలుస్తోంది. "నేను ప్రేమలో ఉన్నాను" అని నిన్న స్టేట్ మెంట్ ఇచ్చిన అఖిల్.. ఎవరితో అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆయితే.. అన్నయ్య ప్రేమకు వచ్చిన సపోర్ట్ చూసి ముచ్చటపడ్డాడో లేక మరొకటో తెలియదు గానీ.. ఇప్పుడు తన లవ్ ఎఫైర్ ను కూడా పబ్లిక్ చేసేశాడు అఖిల్.
అఖిల్ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు "శ్రియ భూపాల్". ఫ్యాషన్ డిజైనర్ అయిన ఈ అమ్మడు మొన్న ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ వేడుకకు హాజరైన చాలా మంది హీరోయిన్లకు స్టైలింగ్ మరియు కాస్ట్యూమ్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త శాలిని భూపాల్ కుమార్తె అయిన శ్రియ భూపాల్ తో అఖిల్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాట్ట. అయితే.. ఇప్పుడు అన్నయ్య పెళ్లి ఫిక్సవ్వడంతో, తన రూట్ క్లియర్ అయ్యింది కాబట్టి, తన ప్రేమ వ్యవహారాన్ని పబ్లిక్ గా చెప్పేశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కొడుకులూ ప్రేమలో పడడంతో.. వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోనున్నందుకు సంతోషించాలో లేక కెరీర్ ల గురించి పట్టించుకోకుండా ఇలా "ప్రేమ.. దోమ" అంటూ తిరుగుతున్న కొడుకులను చూసి బాధపడాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నాడు కింగ్ నాగార్జున!
Also Read