డేటింగ్ యాప్‌పై 'బాహుబలి' తార బొమ్మ!
on Apr 1, 2020
ఆశ్రిత వేముగంటి.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. వై.ఎస్. రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించిన 'యాత్ర' మూవీలో వైఎస్ విజయమ్మ పాత్ర పోషించిన నటి ఆశ్రిత. ఇంకా చెప్పాలంటే రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ 'బాహుబలి'లో అనుష్క వదినగా కనిపించింది ఆశ్రిత. ఆ సినిమాలో 'కన్నా నిదురించరా..' పాటలో ఆమె డాన్స్ కూడా చేసింది. సరే.. ఇప్పుడు ఆమె విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. ఆమె సైబర్ క్రైమ్ అధికారుల్ని కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటోందంట.
కారణం ఏమంటే.. కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక డేటింగ్ యాప్ యాడ్‌పై ఆశ్రిత ప్రొఫైల్ ఫొటో ప్రత్యక్షమవడం! సోషల్ మీడియా యాప్స్ పెరిగిపోవడం, యువత ఎక్కువ సేపు ఇంటర్నెట్పై గడుపుతుండటంతో డేటింగ్ యాప్స్ కూడా పెరిగిపోతున్నాయి. కొన్ని డేటింగ్ యాప్స్ ఫేక్ ప్రొఫైల్స్ ఇస్తుంటే, మరికొన్ని యూత్‌ను ఎట్రాక్ట్ చేయడం కోసం తారల ఫొటోలను వాడేసుకుంటున్నాయి. అలా ఆశ్రిత ఫొటోను ఒక డేటింగ్ యాప్ వాడేసుకుంది.
దీంతో షాక్‌కు గురైన ఆమె ఆ యాప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది ఒక్క ఆశ్రిత సమస్య మాత్రమే కాదు.. ఆమె తరహాలోనే పలువురు తారల ప్రొఫైల్ ఫొటోలను డేటింగ్ యాప్‌లో వాడేసుకుంటున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి పనులపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.