లాక్డౌన్ స్టోరీ: ఇంట్లో నాని ఏం వండాడో తెలుసా?
on Mar 26, 2020
ఇష్టమైన పని చేసేటపుడు కష్టం తెలియదని చెబుతుంటారు. నాని ఇష్టంగా చేశాడు కాబట్టే కష్టం తెలియలేదు ఏమో! సెట్లో స్క్రిప్ట్ పేపర్లు పట్టుకుని తిరిగే స్టార్ హీరో, సైలెంట్‌గా చెఫ్ కింద మారాడు. ఇంతకీ, నాని ఏం చేశాడో తెలుసా? ఇంట్లో వంట వండాడు. అబ్బో... వంటింట్లోకి వెళ్లి కాసేపు గరిటె తిప్పడం కూడా పెద్ద కష్టమేనా అని కొందరు అనుకోవచ్చు. కనీసం స్టవ్ ఆన్ చేయడం కూడా రానోడికి కుకింగ్ చేయడం అంటే పెద్ద కష్టమైన పనే కదా!
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ షట్ డౌన్ అయింది. షూటింగుల్లేవ్. సరదాగా షికార్లు చేయడానికి పర్మిషన్లు లేవ్. కంట్రీ అంతా లాక్ డౌన్ కదా! అందుకని, అందరూ ఇంటి నుండి బయట అడుగుపెట్టడం లేదు. మొదట్లో ఇంటి దగ్గర పక్షుల కిలకిలలు ఎంజాయ్ చేసిన నాని, రీసెంట్గా వంట చేశాడు. "కనీసం స్టవ్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియని వ్యక్తి.. కుక్ కింద మారాడు. అదీ ఒక్క రోజులో. చనా మసాలా వండాడు" అని నాని వైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నాని 25వ సినిమా 'వి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో తొలిసారి విలన్‌గా అతను కనిపించబోతున్నాడు.
Also Read