లావుగా ఉన్న తారక్ పక్కన బొద్దుగా ఉన్న చార్మిని వద్దనుకున్నాం!
on Apr 21, 2021
జూనియర్ ఎన్టీఆర్, బి. గోపాల్ కాంబినేషన్లో వచ్చిన 'అల్లరి రాముడు' కమర్షియల్‌గా బాగానే ఆడింది. ఆ సినిమాలో తారక్ సరసన ఆర్తీ అగర్వాల్ అలరించింది. అయితే నిజానికి హీరోయిన్గా ఫస్ట్ చాయిస్ ఆర్తి కాదు.. చార్మి. హీరో హీరోయిన్లు ఇద్దరూ బొద్దుగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో చార్మిని పక్కనపెట్టి ఆర్తీని తీసుకున్నారు. అవును. ఈ విషయం చెప్పింది అక్షరాలా ఆ సినిమా నిర్మాత చంటి అడ్డాల. ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన చంటి.. తర్వాత నిర్మాతగా పలు సినిమాలు తీశారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'అల్లరి రాముడు' కాస్టింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంటి. ఆ సినిమాలో హీరోయిన్గా మొదట చార్మిని ఎంచుకొని, తర్వాత ఆర్తీని ఎందుకు తీసుకున్నారో ఆయన వివరించారు.
"నిజానికి 'అల్లరి రాముడు'కు హీరోయిన్గా ఫస్ట్ చార్మిని పట్టుకొచ్చాం. పరుచూరి గోపాలకృష్ణ గారు, గోపాల్, నేను కూర్చొని మాట్లాడుకొనేటప్పుడు తారక్ కొంచెం లావుగానూ, బొద్దుగానూ ఉన్నాడు, ఈ అమ్మాయీ బొద్దుగా ఉంది. స్క్రీన్ మీద చూసేటప్పుడు మనమేమన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనే కామెంట్ వచ్చింది. చార్మి చాలా అందంగా, బాగుంది కదా అని కూడా అనుకున్నాం. ఒకవేళ డైట్ చేయించి తగ్గిద్దామా అనేది కూడా చర్చకు వచ్చింది. అయితే అన్ని రోజులు ఆగాలా అని కూడా అనుకున్నాం. అప్పుడు ఆర్తీ అగర్వాల్ సక్సెస్‌లో ఉంది. గోపాల్ ఆమె పేరు సజెస్ట్ చేశాడు. సరేనని ఆమెను 'అల్లరి రాముడు'లో హీరోయిన్గా పెట్టడం జరిగింది." అని చెప్పుకొచ్చారు చంటి అడ్డాల. అదీ విషయం!
Also Read