కాకినాడలో బన్ని కొట్లాట!!
on Aug 5, 2019
అవును మీరు చదివింది నిజమే. బన్ని కి టార్జన్ కి మధ్య కాకినాడలో కొట్లాట జరుగుతోందట. కానీ , నిజంగా కాదు సినిమా కొట్లాట. స్టైలిష్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కాకినాడలోని పోర్ట్ ఏరియాలో చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో జరుగుతోంది. ఈ నెల 10 వరకు అక్కడే షూటింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హైపర్ ఆదికి మంచి వేషం దక్కినట్లు తెలుస్తోంది. కాకినాడ షెడ్యూల్ లో హైపర్ ఆది పాల్గొన్నాడట. త్రివిక్రమ్ లాంటి పంచ్ లతో జబర్దస్త్ లో నవ్వులు పండించే ఆదికి నిజంగా మంచి అవకాశమే అని చెప్పాలి. ఇక తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరపనున్నట్లు సమాచారం. ఇటీవల టబు పోర్షన్ అన్నపూర్ణలో కొంత వరకు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ లో టబు పాల్గొనే అవకాశాలున్నాయట. తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని బేనర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.