పాటల్లో 'వెంకీ మామ'
on Aug 1, 2019
రామోజీ ఫిలిం సిటీ లో 'వెంకీ మామ' పాట పాడుతున్నాడు. పాయల్ రాజ్ పుత్ తో కలిసి స్టెప్పులు వేస్తున్నాడు. మరో మూడు రోజులు వెంకీ మామ, పాయల్ పాట చిత్రీకరణలో బిజీ బిజీ. విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. బుధవారం వరకు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్ లో జరిగింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ తీశారు. ఈరోజు నుండి రామోజీ ఫిలిం సిటీ లో సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మిగతా సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేశారు. పంద్రాగస్టుకు ఒక పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుందట. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయాలనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. అదే రోజున సైరా నరసింహారెడ్డి విడుదల చేస్తామని మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరు సినిమాకు పోటీగా వస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.