ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి!!
on Jul 31, 2019
వెండి తెరపైకి మరో క్రికెటర్ బయోపిక్ రానుంది. అది కూడా టాలీవుడ్ నటుడు రానా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. అయితే ఆ బయోపిక్ ఎవరిది అన్నదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా స్పిన్ లెజెండ్ గా పేరు తెచ్చుకున్న శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్. అవును రానా నిర్మాణంలో విజయ్ సేతుపతి మురళీధరన్ గా నటిస్తున్నాడు. శ్రీపతి డైరక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
క్రికెట్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడం పట్ల విజయ్ సేతుపతి సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా ...ఇలాంటి చిత్రం చేయడం నిజంగా సవాల్ లాంటిదే అంటున్నారు నిర్మాత రానా. ఇక ఈ సినిమా విషయంలో మురళీదరన్ కూడా పాలు పంచుకోవడం విశేషం. ఇక ఇప్పటికే ఈ టీమ్ తో మురళీధరన్ కొన్ని నెలలుగా ట్రావెల్ చేస్తూ తన అనుభవాలు, అనుభూతులు పంచుకుంటున్నారు. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2020 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.