మరో రీమేక్‌లో సమంత బ్యూటి!!
on Jul 1, 2019
పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది సమంత బ్యూటి. `యూ టర్న్` తర్వాత మహిళా ప్రధాన్యమున్న `ఓ బేబి` చిత్రంలో నటించింది స్యామ్. ఈ సినిమా ఈ నెల 5న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కొరియన్ `మిస్ గ్రాని` సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో రీమేక్ కి రెడీ అవుతోన్నట్లు సమాచారం అందుతోంది. ఈ రీమేక్ లో సామ్ క్యాబ్ డ్రైవర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రజంట్ `అర్జున్ రెడ్డి` రీమేక్ తమిళంలో `ఆదిత్య వర్మ` ని డైరక్ట్ చేస్తోన్న గిరీశయ్య దర్శకత్వంలో సామ్ నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా పై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.