మెగాస్టార్ బర్త్ డే కు చరణ్ గిఫ్ట్ ఏంటో తెలుసా!!
on Jun 1, 2019
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా` సినిమాలో బిజీ బిజీ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అసలు ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా సైరా లేటైనందువల్ల కొరటాల శివ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక సైరా సినిమా వర్క్ కూడా క్లైమాక్స్ కి రావడంతో ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా సినిమాను ప్రారంభించి సెప్పెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాత రామ్చరణ్. ఇక ఈ సినిమాలో చిరంజీవి రైతుగా, ఎన్ ఆర్ ఐ గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం అందుతోంది. ఇక చిరు బర్త్ డే కు చరణ్ ఇవ్వబోయే గిఫ్ట్ ఈ సినిమానే అని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.