కొడుక్కి బాధ్యతలు అప్పగించిన రాజమౌళి
on Mar 7, 2019
ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న మహా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో షెడ్యూల్ ప్లాన్ ఇప్పటికే జరిగిపోయిందట. కలకత్తా లో కొత్త షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరపనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరితో ఒక హీరోయిన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకుంటే ఇంత వరకు హీరోయిన్స్ ఎవరన్నది మాత్రం బయటకు రాలేదు. ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఎంతో కేర్ తీసుకుంటున్నాడట. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో కూడా కార్తికేయ పనులన్నీ చక్కబెట్టాడు. ఇక ఈ సినిమాకోసం మరిన్ని బాధ్యతలు తనపై వేసుకున్నాడట కార్తికేయ. ఇక అన్ని సినీ ఇండస్ట్రీల చూపు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ పైనే ఉంది. బాలీవుడ్ సైతం భయపడేలా ఈ సినిమా బడ్జెట్ ఉండటం మరో కారణం. మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈచిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియాభట్, పరిణితి చోప్పాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరు షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు? డేట్స్ అడ్జస్ట్ మెంట్స్ లాంటి విషయాలన్నీ కార్తికయ చూసుకుంటున్నాడట.