షేడ్స్ ఆఫ్ `సాహో` చాప్టర్ 2 వచ్చేస్తోంది!!
on Feb 26, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సాహో`. ఈ సినిమా ప్రజంట్ ఆర్ ఎఫ్సి లో షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షేడ్స్ సాహో చాప్టర్ 1ను ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ బర్త్ డే కానుకగా మార్చి 3న షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2ను రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని అధికారికంగా ఈ రోజు ఓ వీడియో ద్వారా ప్రకటించారు చిత్ర సభ్యులు. ఇంటర్నేషనల్ స్టాండెర్డ్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ` రన్ రాజా రన్` ఫేం సుజీత్ దర్శకుడు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ హాలీవుడ్ టెక్నీషియన్స్ చేత తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.