మహేష్ టైటిల్ ఫిక్స్ చేసాడు!!
on Jan 31, 2019
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగానే కాదు బిజినెస్ మెన్ గానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం ప్రారంభించిన మహేష్, తాజాగా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. జియోతో కలిసి మహేష్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ కు టైటిల్ ను నిర్ణయించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీష్ కు `చార్లీ` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను మూడు సీజన్లలో 8 ఎపిసోడ్లుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు యూనిట్. మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాలో పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.