ఇద్దరమ్మాయిలతో ఇస్మార్ట్ శంకర్ !!
on Jan 31, 2019

ఇద్దరమ్మాయిలతో ఇస్మార్ట్ శంకర్ రొమాన్స్ చేస్తున్నాడు. అవును ఇటీవలే నిధి అగర్వాల్ ను రామ్ సరసన హీరోయిన్ గా ఓకే చేసిన పూరి జగన్నాథ్ మరో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేసాడు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో శెరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.. రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ పోతినేని సరసన నిధి అగర్వాల్,నభ నటేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు: పూరి జగన్నాధ్ , నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, సమర్పణ: లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



