చిరంజీవి ఎప్పుడంటే అప్పుడు...
on Oct 29, 2018
దర్శకుడు కొరటాల శివ బాల్ని చిరంజీవి కోర్టులోకి తోసేశారు. చిరు ఎప్పుడు అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి తాను రెడీ అని చెప్పార్ట. అందువల్ల, ఇప్పుడు నిర్ణయం చిరు చేతుల్లోనే వుంది. 'సైరా' సినిమా షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఆయన కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయవచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి రామ్చరణ్ ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేశారని సమాచారం! బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశార్ట. సో... చిరు ఎప్పుడు అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సంక్రాంతికి ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని టాక్. ఈలోపు 'సైరా'లో మేజర్ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందట. తమిళ దర్శకుడు శంకర్ తరహాలో కమర్షియల్ సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వడం కొరటాల స్టయిల్. చిరంజీవి నటించిన 'ఠాగూర్', 'స్టాలిన్' అటువంటి సినిమాలే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా వుంటుందో మరి?!