బిగ్ బాస్ నుండి ఈ వారం ఇద్దరు ఔట్..!!
on Aug 30, 2018
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ రెండో సీజన్ చివరి దశకు చేరుకుంటుంది.. దీంతో ప్రతివారం జరిగే ఎలిమినేషన్ మీద ప్రేక్షకుల్లో రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది.. ఈ వారం నామినేషన్లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.. కౌశల్,సామ్రాట్, నూతన నాయుడు, అమిత్ మరియు గణేష్ ఉన్నారు.. ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.. అయితే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2, ఈ వారం ఓ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవబోతున్నారట.
నిజానికి పోయిన వారమే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ ఒక్కరే ఎలిమినేట్ అయ్యారు.. కానీ ఈ వారం మాత్రం కచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. దానికి కారణం ఓ వైపు షో ఫైనల్ స్టేజికి చేరుకుంటుంది.. కానీ రీఎంట్రీ పుణ్యమా అని కంటెస్టెంట్స్ మాత్రం ఎక్కువ అయిపోయారు.. అందుకే ఈ వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారట.. మరోవైపు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కామన్ మ్యాన్ గా వచ్చిన గణేష్ ఇన్ని వారాలు ఉంటాడని అతను కూడా ఊహించలేదు.. కానీ ఈ వారం గణేష్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహిస్తున్నారు.. అదే విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే గణేష్ తో పాటు అమిత్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.. చూద్దాం మరి ఈ వారం ఏం జరుగుతుందో.