పవన్ - త్రివిక్రమ్ విబేధాలు...ఇదిగో సాక్ష్యం!
on Mar 27, 2018
పవన్ కల్యాణ్ వెంట త్రివిక్రమ్ - త్రివిక్రమ్‌తోనే పవన్ కల్యాణ్...
కొన్నేళ్లుగా వీరిద్దరి బంధం ఇలానే సాగింది. పవన్ గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచులు చూస్తుంటే... పవన్ అభిమానుల రోమాలు నిక్కబొడుస్తుంటాయి. ఆ స్థాయిలో సాగాయి అవన్నీ. త్రివిక్రమ్‌కి చెప్పకుండా పవన్ ఒక్క అడుగూ వేయడని.. అసలు పవన్ పొలిటికల్ స్పీచులన్నీ త్రివిక్రమ్ రాసిచ్చినవే అంటూ ఓ వర్గం వాదిస్తుంటుంది. వారిద్దరి మధ్య బంధం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అయితే.. తాజాగా ఈ స్నేహ బంధానికి బీటలు వేస్తున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ బాగా నొచ్చుకున్నాడని, త్రివిక్రమ్ బాధ్యతా రాహిత్యం పవన్‌కి అస్సలు నచ్చలేదని, అప్పటి నుంచీ వీరిద్దరూ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారని వార్తలు వినిపించాయి. తీరా అవన్నీ నిజమే అనిపిస్తోంది. ఇందుకు సాక్ష్యం కూడా దొరికేసింది.
ఛల్ మోహన రంగకు అతిథులుగా పవన్, త్రివిక్రమ్‌లు వస్తున్నారని ప్రచారం జరిగింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఈ సినిమాకి పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలు. అందుకే వాళ్లు రావడంలో ఎలాంటి షాకూ లేదు. కానీ ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ డుమ్మా కొట్టి గట్టి షాక్ ఇచ్చాడు. పవన్ పాలుపంచుకున్న ప్రతీ సినిమా వేడుకకు త్రివిక్రమ్ రావడం పరిపాటి. కానీ.. తాను వచ్చి తీరాల్సిన ఫంక్షన్‌కి మాత్రం చెప్పాపెట్టకుండా డుమ్మా కొట్టేశాడు. దానికి కారణం.. పవన్‌తో సరిగా పొసగకపోవడమే అని టాక్. అజ్ఞాతవాసి తరవాత త్రివిక్రమ్ - పవన్‌లు అసలు కలుసుకోనేలేదని, అది క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెంచేసిందని, ఒకవేళ ఈ కార్యక్రమానికి తానొస్తే.... ఎప్పటిలా... పవన్‌ని ఆకాశాన్ని ఎత్తేసేలా మాట్లాడాలని, మనసులో ఆ ప్రేమ తగ్గిపోయింది కాబట్టి.. ఫంక్షన్‌కి రాకుండా ఉండడమే బెటర్ అని త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కనీసం పవన్ కల్యాణ్ స్పీచులో కూడా త్రివిక్రమ్ ప్రస్తావన లేదు. వీరిద్దరి దూరానికి ఇంతకంటే బలమైన సాక్ష్యాలు ఏం కావాలి? మరి వీటిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.