రజని కాంత్ రాజకీయ ప్రవేశం ఖరారైనట్టే..!
on May 15, 2017
అట్టడుగు స్థాయి నుండి సినీ వినీలాకాశం లో సూపర్ స్టార్ గా ఎదిగిన అగ్ర కథానాయకుడు రజని కాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం పై ఆసక్తికర మాటలను తన అభిమానులతో పంచుకున్నారు.అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన రాజకీయ ప్రవేశం పై గతంలో ఆయన అనాసక్తతగానే మాట్లాడేవారు.తాజగా ఆయన మాట్లాడిన మాటలు అందరిని మరింతగా రాజకీయాలలోకి రావడమే తరువాయి అనేలా బలపరుస్తున్నాయి.ఆయన మొదట మద్యానికి అలవాటుపడొద్దని అభిమానులకు చెప్పారు.
తర్వాత రాజకీయ ప్రవేశం అనేది దేవుడి చేతుల్లో ఉందని పేర్కొన్నాడు. తానెప్పుడూ నిజాయితీగానే పనిచేస్తానని అన్నారు.ఈ మాటలు అభిమానుల్లో సంబరాన్ని తెచ్చాయి.ఎప్పుడూ అనాసక్తిని చూపే మాటలనే మాట్లాడే ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి తొలి బీజంగా మారాయి.మరి అభిమానులు మాత్రం ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖరారు అయినట్టే అని చెప్పుకుంటున్నారు.మరి సూపర్ స్టార్ రాజకీయ స్టార్ గా రానున్న ప్రకటనను ఎప్పుడు చేస్తాడో చూడాలి మరి.