తడవటానికి కాజల్ పెట్టిన కండీషన్స్ ఇవే..!
on Mar 13, 2017
హీరోలతో పోలిస్తే..హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ చాలా తక్కువ..మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఇంకాస్త మంచి పేరు ఉంటే ఇంకో రెండు సంవత్సరాలు..ఇలాంటి పరిస్థితుల్లో దీపముండగాని ఇల్లు చక్కపెట్టుకోవాలనే సామెతను తూ.చ తప్పకుండా ఫాలో అవుతుంటారు హీరోయిన్లు. దీనిలో భాగంగా ఒక చేత్తో సినిమాలు చేస్తూనే మరో చేత్తో ఐటెమ్ సాంగ్స్‌తో దుమ్ము దులిపేస్తుంటారు. ఈ జాబితాలో ఎందరో హీరోయిన్లు..టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం కావొస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కూడా ఐటెం సాంగ్‌లో మెరిసింది. గతేడాది వచ్చిన జనతా గ్యారేజ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక పాటలో చిందులేసింది. రీసెంట్గా ఇలాంటి ఆఫర్ మరోకటి వచ్చిందట.
ఒక సినిమాలో రెయిన్ సాంగ్‌లో నటించాల్సిందిగా కాజల్‌ను ఓ నిర్మాత కోరాడట. అయితే ఫస్ట్ నో అని చెప్పినప్పటికీ, మంచి పారితోషికంతో పాటు ఈ పాట మూవీకి కీలకమని నిర్మాత చెప్పడంతో చివరికి కొన్ని కండీషన్స్‌తో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. అవేంటంటే పాటని షూట్ చేసే సమయంలో టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ మాత్రమే స్పాట్లో ఉండాలట. లైట్ బాయ్స్, డ్యాన్సర్స్ కూడా ఉండకూడదని తేల్చి చెప్పిందట. కాజల్ సాంగ్ చేయాలే కానీ, ఎటువంటి కండీషన్స్కైనా ఓకే అనేశాడట నిర్మాత. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అఫిషియల్‌గా బయటకు వచ్చే అవకాశముంది.