English | Telugu

తేజూ... అదే కాస్త త‌గ్గించు!

on Feb 25, 2017

మెగా హీరోల్లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌.  పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్.... ఇలా వ‌రుస విజ‌యాల‌తో మాస్ హీరో అయిపోయాడు. సాయి సినిమా అంటే.. ఓపెనింగ్స్ కూడా ఎట్రాక్టీవ్‌గా ఉండ‌డంతో తేజూతో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దాంతో పాటు సినిమా సినిమాకీ బ‌డ్జెట్ పెంచుకొంటూ వెళ్తున్నారు.  ఈజ్ లో, డాన్సింగ్ పెర్‌ఫార్మ్సెన్స్‌లో తేజూకి తిరుగులేదు. ఏ స్టార్ హీరోతో అయినా పోటీ ప‌డగ‌ల‌డు. అయితే... తేజూ యాక్టింగ్ క్యాప‌బులిటీస్ పైనే అనుమానాలున్నాయి. ప‌దే ప‌దే చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను అనుక‌రించ‌డం, వాళ్ల మేన‌రిజాల్ని కాపీ కొట్ట‌డం తేజూకి ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది.

మావ‌య్య‌ల‌ను ఒక‌ట్రెండు సార్లు గుర్తు చేస్తే చాలు. అదే ప‌నిగా.. అది త‌ప్ప ఇంకేం చేత‌కాద‌న్న‌ట్టు చిరంజీవినో, ప‌వ‌న్ క‌ల్యాణ్‌నో ఇమిటేట్ చేస్తూ ఆడియ‌న్స్‌ని ఇరిటేట్ చేస్తున్నాడు. దాంతో తేజూపై కాపీ క్యాట్ అనే ముద్ర ప‌డే ప్ర‌మాదం ఉంది. విన్న‌ర్‌లో ఇదే క‌నిపించింది.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్, డైలాగ్ డెలివ‌రీ.... ఇలా ఏది తీసుకొన్నా అటు చిరునో, ఇటు ప‌వ‌న్‌‌నో ఇమిటేట్ చేసిన ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లుగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చిరు పాట‌ల్ని ఎడా పెడా వాడేసిన సాయి ధ‌ర‌మ్‌.. ఇప్పుడు న‌ట‌న‌లోనూ కాపీ కొట్టడంతో.. మెగా ఫ్యాన్స్ నుంచే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మావ‌య్య‌ల‌ను ఈ రూపంలో వాడ‌డం మానేసి.. త‌న‌దైన సొంత ముద్ర చూపించుకొంటే మంచిది. లేదంటే.. తేజూ కెరీర్ ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here