సమంత కన్ఫర్మ్ చేసింది
on Nov 28, 2019
యస్... సమంత కన్ఫర్మ్ చేసింది. 'ది ఫ్యామిలీ మాన్: సీజన్ 2' వెబ్ సిరీస్లో తాను నటిస్తున్నట్టు అక్కినేని కోడలు కన్ఫర్మ్ ఈ రోజు కన్ఫర్మ్ చేసింది. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్, కిషోర్ తదితరులు నటించిన 'ది ఫ్యామిలీ మాన్' నెటిజన్లను ఆకట్టుకుంది. అమెజాన్ కోసం దర్శక ద్వయం రాజ్ నిడమోరు, కృష్ణ డీకే ఈ సిరీస్ తీశారు. వాళ్లిద్దరూ తెలుగువాళ్లే. ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు.
'ది ఫ్యామిలీ మాన్' ఫస్ట్ సీజన్ సమంతకు తెగ నచ్చేసింది. అప్పట్లో దర్శకులు రాజ్-డీకేపై ప్రశంసలు కురిపించింది. తర్వాత కొన్ని రోజులకు 'ది ఫ్యామిలీ మాన్' సెకండ్ సీజన్ లో సమంత నటిస్తుందనే వార్త బయటకొచ్చింది. అందులోనూ ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేయనుందనేది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించింది. గురువారం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా తాను అందులో నటిస్తున్న సమంత కన్ఫర్మ్ చేసింది. "యస్! ఫైనల్లీ... మై వెబ్ సిరీస్ డెబ్యూ" అని సోషల్ మీడియాలో సమంత పేర్కొంది. దీని కంటే ముందు '96' తెలుగు రీమేక్ తో ప్రేక్షకులను ఆమె పలకరించనుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఆ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read