తమన్‌తో రీమేక్స్ కే ఫిక్సయిన మెగా బ్రదర్స్!
on Jan 21, 2021
మెగా కాంపౌండ్ లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. నాయక్, రేసు గుర్రం, సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, తొలి ప్రేమ, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ తో పాటు తన కెరీర్ బెస్ట్ మూవీ అయిన అల వైకుంఠపురములో కూడా ఈ కాంపౌండ్ లో చేసిన సినిమాలే. అయితే ఇవన్నీ కూడా మెగా యంగ్ హీరోల (రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు శిరీష్) కాంబినేషన్ లోనే వచ్చాయి.
కాగా, ఎట్టకేలకు మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు తమన్. ఆల్రెడీ పవన్ కాంబోలో వకీల్ సాబ్ తో పాటు మరో సినిమా చేస్తున్న తమన్ కి.. తాజాగా చిరు కొత్త చిత్రానికీ స్వరాలు సమకూర్చే బాధ్యత దక్కింది. చిత్రమేమిటంటే.. అటు పవన్ తోనూ, ఇటు చిరుతోనూ తమన్ చేస్తున్న సినిమాలన్నీ రీమేక్ లే. హిందీ చిత్రం పింక్ ఆధారంగా వకీల్ సాబ్ తెరకెక్కితే.. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా పవన్ మరో చిత్రం రూపొందుతోంది. ఇక మెగాస్టార్ చేయబోతున్న సినిమా ఏమో.. మాలీవుడ్ సెన్సేషన్ లూసీఫర్ కి రీమేక్. మొత్తమ్మీద.. మెగా బ్రదర్స్ చిరు, పవన్.. తమన్ తో రీమేక్స్ కే ఫిక్సయ్యారు.
మరి.. మెగా కాంపౌండ్ లో ఇప్పటివరకు స్ట్రయిట్ సబ్జెక్ట్స్ తోనే సక్సెస్ లు చూసిన తమన్.. మెగా బ్రదర్స్ కాంబినేషన్స్ సమేతంగా రీమేక్స్ తోనూ విజయాలు అందుకుంటాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
