సూర్యతో గ్యాంగ్ లీడర్ భామ?
on Jan 21, 2021
నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియా అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారంతో పాటు కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న డాక్టర్ లోనూ నాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే ప్రియ దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ క్రేజీ ఆఫర్ వరించిందట. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ పాండిరాజ్ ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో కథానాయికగా ప్రియా అరుళ్ మోహన్ ఎంపికయిందని టాక్. త్వరలోనే ప్రియ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డి. ఇమాన్ బాణీలు అందించనున్నారు.