మరో పవర్‌స్టార్ పుట్టాడు..!
on Oct 10, 2017
పవర్ స్టార్ చెప్పలేనంత ఆనందంలో ఉన్నాడు. కారణం... తండ్రి అవ్వడమే. అదేంటి? పవన్ ఇప్పటికే మూడు సార్లు తండ్రి అయ్యాడు కదా! అనుకుంటున్నారా? అవును.. మళ్లీ నాల్గవ సారి తాను తండ్రి అయ్యాడు. పవర్ స్టార్ భార్య అన్నా లెజనోవా మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ కి ఓ కుమారుడు ఉన్నాడు. అతనే అకిరానందన్. రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ ల సంతానమైన అకిరానందన్... ఇప్పుడు తండ్రి అంత ఎదిగాడు. త్వరలో హీరోగా అరంగేట్రం చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ తర్వాత రేణు, పవన్ లకు ‘ఆద్య’ పుట్టింది. అంటే... రేణుదేశాయ్ తోనే ఓ అబ్బాయ్ కీ, ఓ అమ్మాయ్ కీ జన్మనిచ్చాడు పవన్.
రేణుతో విడిపోయాక.. ఆయన అన్నా లెజనోవాను వివాహం చేసుకున్న విషయం తెలిసిదే. వీరిద్దరికీ ఇప్పటికే ఓ ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి పేరు ‘పొలేనా’. ఇప్పుడు లెజనోవాకు అబ్బాయ్ పుట్టాడు. అంటే.. పవర్ స్టార్ కి రెండో వారసుడు పుట్టాడన్నమాట. రేణుతో విడిపోయినా కూడా తన బిడ్డలకు మాత్రం పవన్ దూరం కాలేదు. ఇప్పటికీ అకిరానందన్, ఆద్యా ఆలనాపాలనా చూసుకుంటేనే ఉన్నాడు. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పుడు తండ్రిగా మరో బాధ్యత పవర్ స్టార్ పై పడింది. ఏది ఏమైనా... తండ్రిగా పరిపూర్ణమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్.
మంగళారం అబ్బాయ్ పుట్టీపుట్టగానే.. ఆ లేత గుడ్డుని తన వడిలోకి తీసుకొని ముద్దాడాడు. తండ్రీకొడుకులిద్దరూ ఫొటోకి స్టిల్ కూడా ఇచ్చేశారు. ఆ స్టిల్ లో పవన్ కళ్లల్లో అంతులేని ప్రేమ కనిపిస్తోంది. కావాలంటే చూడండి.