వెంకటేశాయ దెబ్బ.. రాజు గారు అబ్బా!
on Feb 16, 2017
వరుస హిట్లతో దూసుకుపోతున్న నాగార్జున కి ఓం నమో వెంకటేశాయ రూపం లో పెద్ద దెబ్బ పడింది. కొందరు ఈ సినిమా బాగుందని చెప్పినా, కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రం గానే ఉన్నాయి. పంపిణీదారులు సేఫ్ అవ్వాలంటే ఈ సినిమా థియేటర్ల ద్వారా కనీసం ౩౭ కోట్లు రాబట్టాలి. ఇప్పటి వరకు పట్టుమని 10 కోట్లు కూడా రాబట్టని సినిమా, ఇక ముందు అద్భుతాలు చేసే అవకాశం లేదు. చిత్ర యూనిట్ కూడా దాదాపు చేతులెత్తేసినట్టే కన్పిస్తుంది. ఎందుకంటే, ప్రమోషన్స్ కూడా చెప్పుకో దగ్గ లేవు.
అయితే, ఇంతకు మించిన విషయం ఒకటి, నాగార్జున ని కలవరపెడుతుంది. అంతకు ముందు పట్టుమని 25-30 కోట్లు కూడా లేని నాగార్జున మార్కెట్, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి తో 40 కోట్ల మార్కుని దాటింది. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ పరాజయంతో నాగ్ కథ మల్లి మొదటికొచ్చింది. విషయం ఏంటంటే, నాగార్జున తదుపరి చిత్రం రాజుగారి గది 2 ని కొనడానికి బయ్యర్లు బెంబేలెత్తుతున్నారంట. నాగ్ మీద ఇప్పటికి పోగొట్టుకుంది చాలు, ఇంక రిస్క్ చేయలేము అంటున్నారంట. నాగ్ మీద పూర్తి నమ్మకం పెట్టి మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాతల పరిస్థితేంటి! ఈ సినిమా ద్వారా అగ్ర దర్శకుల జాబితాలో చేరుదామనుకున్న ఓంకార్ అన్నయ్య పరిస్థితేంటి!