English | Telugu

తేజ్ కు ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయిందా!!

on Apr 17, 2019

 

సినిమా ప‌రిశ్ర‌మలో షూటింగ్ ప్రారంభం నుంచి ట్రైల‌ర్ రిలీజ్, ఆడియో రిలీజ్‌, సినిమా రిలీజ్ ఇలా ప్ర‌తి దానికి ఒక ముహూర్తం చూసుకొని చేస్తుంటారు. డైర‌క్ట‌ర్స్, హీరోస్, హీరోయిన్స్ , ప్రొడ్యూస‌ర్స్ ఇలా ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ తో పేర్లముందు కొత్తగా ఒక అక్ష‌రం యాడ్ చేయ‌డం లేక తొలగించ‌డం చేస్తుంటారు. ఇలా సినీ ప‌రిశ్ర‌మలో పేర్లు మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇక తాజాగా ఆ జాబితా లోకి మెగా హీరో కూడా చేరాడు.

అవును  మెగా మేన‌ల్లుడు  సాయి ధ‌ర‌మ్ తేజ్ గా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయ్యాడు. మొద‌ట మంచి స‌క్సెస్ లే అందుకున్న‌ప్ప‌టికీ  త‌ర్వాత‌ర్వాత వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌చ్చాడు. ఇటీవ‌ల కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ` చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.  ఈ సినిమా అటు ప్రేక్ష‌కుల‌, ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు బ‌దులుగా సాయి తేజ్ గా త‌న పేరు మార్చుకున్నాడు. దీంతో పేరు మార్చ‌కోవ‌డం సాయితేజ్ కు క‌లిసొచ్చింది. మంచి స‌క్సెస్ ప‌డింద‌న్న టాక్ వినిపిస్తోంది.  ఇందులో నిజం ఉన్నా, లే కున్నా కానీ, మెగా మేన‌ల్లుడుకు ఈ సినిమా స‌క్సెస్ కావ‌డంతో ప‌ట్ల అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


Cinema Galleries



Latest News


Video-Gossips