రవితేజ `క్రాక్` లుక్ కిర్రాక్
on Jan 2, 2020
మాస్ రాజా రవితేజ న్యూ ఇయర్ రోజు `క్రాక్` సినిమాలో కిర్రాక్ లుక్ తో పలకరించాడు. మాంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రవి తేజ ఈ ఇయర్ వరుస సినిమాలతో రానున్నాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన క్రాక్ ఫస్ట్ లుక్ కిర్రాక్ గా ఉందంటున్నారు. కాకి డ్రెస్ లో సోడా తో కాళ్లను కూల్ చేసుకుంటున్న హాట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ యమా ఫాస్ట్ గా జరుగుతుంది. రవితేజ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్టెన్స్ లుక్, చేతిలో గోలీసోడాను పట్టుకున్న రవితేజ `క్రాక్` సినిమా ఫస్ట్‌లుక్ బాగుంది. ఈ లుక్‌లో రవితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిలబడి ఉండటాన్ని చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. మెర్సల్, బిగిల్ చిత్రాలల్లో విజువల్ బ్యూటీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నది.