అమెరికా నేపథ్యంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా?
on Oct 17, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' మంచి విజయం అందుకుంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమాలో ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించారు త్రివిక్రమ్. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యంలో కొత్త సినిమా కథ సాగుతుందని సమాచారం. ఆల్రెడీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారట. మెజారిటీ పార్ట్ అమెరికాలో చిత్రీకరణ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారని టాక్.
ఎన్టీఆర్ సినిమా కంటే మహేష్ బాబు సినిమా చిత్రీకరణను త్రివిక్రమ్ ముందుగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. అది పూర్తి కావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. అందుకని, ముందుగా మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నారట.