బాలీవుడ్ లో క్రిష్ మరో సినిమా!!
on May 6, 2019
విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించడంలో క్రిష్ సిద్ధహస్తుడు. ఇటీవల విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ బయోపిక్ కు డైరక్ట్ చేసాడు. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా క్రిటిక్స్ నుంచి ప్రశంసులు అందుకున్నాయి రెండు పార్ట్ లు. ఇక క్రిష్ తదుపరి చిత్రం పై ప్రజంట్ ఆసక్తి నెలకొంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం తన నెక్ట్స్ సినిమా బాలీవుడ్ లో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అక్షయ్ కుమార్ తో గబ్బర్ ఈ జ్ బ్యాక్ సినిమా చేసాడు క్రిష్. ఠాగూర్ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ సినిమా డైరక్ట్ చేసే సమయంలో ఇద్దరికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట. ఆ రిలేషన్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. త్వరలో ఈ సినిమా పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.