లేడీ సూపర్ స్టార్ పెళ్లికి రెడీ!
on May 6, 2019
.jpg)
గత కొంత కాలంగా అందాల తార నయనతార, తమిళ్ డైరక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఇప్పుడు పరిణయంగా మారుతోంది. త్వరలో వీరు నిశ్చితార్థం జరుపుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలో నవంబర్ లో నిశ్చితార్థం చేసుకోవాలని నయన్, విఘ్నేశ్ డిసైడ్ అయ్యారట. ఈ న్యూస్ ప్రజంట్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే ఇదివరకే ఇద్దరు రింగ్ లు మార్చుకున్నారట. ఇక పెద్దల సమక్షంలో యంగేజ్ మెంట్ వేడుక గ్రాండ్ గా నిర్వహించాలని రెండు కుటుంబాలు ప్లాన్ చేస్తున్నారట. అనుకున్న విధంగా జరిగితే నెక్ట్స్ ఇయర్ లో నయన్, విఘ్నేశ్ లు ఏడడుగులు వేయనున్నారు. ఇక వీరిద్దరికీ నానుమ్ రౌడీదాన్ అనే చిత్రం ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ప్రజంట్ నయనతార తెలుగులో సైరా చిత్రంలో నటిస్తోంది. అలాగే వరుస తమిళ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



