చావంటే 'సైరా'కు భయం లేదు!
on Jun 19, 2019
'ఒరేయ్! నేను ఒట్టి చేతులతో వచ్చా. నువ్ భుజం మీద తుపాకీతో వచ్చావ్. అయినా... నా చెయ్యి మీసం మీదకు వెళ్లేసరికి నీ బట్టలు తడిచిపోతున్నాయిరా' - 'సైరా నరసింహారెడ్డి'లో ఓ డైలాగ్.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేతులు కట్టేస్తారు. ముఖం ముందు ఉరితాడు వేలాడుతుంది. అయినా ఉయ్యాలవాడలో భయం లేదు. ధైర్యంగా ఉంటాడు. అప్పుడు విలన్ 'ఏంట్రా ధైర్యం? చావుభయం లేదా?' అని అడుగుతాడు. అప్పుడు 'సైరా' ఏమంటాడో తెలుసా? 'చచ్చిపుట్టినవాణ్ణి... చనిపోయిన తరవాత కూడా బతికేవాణ్ణి. చావంటే నాకెందుకురా భయం'
చిరంజీవి నోటి వెంట ఈ డైలాగులు వస్తే ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఇవే కాదు... తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి'లో బోలెడు పంచ్ డైలాగులు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి అవన్నీ చెబుతున్నారు. 'సైరా' డబ్బింగ్ స్టార్ట్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
