విలన్‌గా మ్యూజిక్ డైరెక్టర్
on Jun 19, 2019

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేస్తున్నాడు. రామ్ చరణ్ 'ధృవ' మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ (ఆది) కూడా హీరోగా చేస్తున్నాడు. తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్ అప్పుడప్పుడూ సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ విలన్‌గా చేయలేదనుకుంట. ఇప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే క్రూరమైన విలన్ క్యారెక్టర్ చేశారు. 'లండన్ బాబులు' ఫేమ్ రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమా 'పలాస'. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో 1970 కాలంలో మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో రఘు కుంచె విలన్‌గా చేశారు. అన్నట్టు... ఈ సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



