English | Telugu

బెల్లంకొండకు భయం పట్టుకుంది

on Aug 13, 2019

తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన  `రాక్షసుడు ` మంచి విజయం సాధించింది. సక్సెస్ ఫుల్ గా రన్  అవుతోంది ..మరి బెల్లంకొండ సురేష్  హ్యాపీ గా ఉండక...  భయమెందుకు అనేకదా మీరు  అను కుంటున్నారు? అక్కడికే వస్తున్నా ... ప్రెసెంట్ బెల్లంకొండ పుత్రోత్సాహం లో ఉన్నాడు. సినిమాకు మంచి టాక్ తో రన్ అవుతూ రోజు రోజుకూ థియేటర్స్, కలెక్షన్స్ పెంచుకుం ట్టుంది. ఈ క్రమము లో బెల్లంకొండ సురేష్ తన సంతోషాన్ని మీడియా తో పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ``ఇప్పటి వరకు  వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ  వెళ్లి పోయాం ..ఇక రాక్షసుడు   సినిమా ఇచ్చిన సక్సెస్ తో తదుపరి సినిమా ఎలా? చేయాలి ...ఈ సక్సెస్ ని ఎలా కాపాడుకోవాలి అన్న భయం మొదలైంది. ఇకపై చేసే ప్రతి సినిమా ఎంతో కేర్ తీసుకొని చేస్తాము. ఈ సక్సెస్ ని ఇలాగే కొనసాగించడానికి ప్రయత్నిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు సురేష్.  సక్సెస్ కొట్టడమే కాదు ...దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే   మరి.  ఇక జర్నలిస్ట్ ల సంక్షేమ నిధికి కొంత విరాళాన్ని అంద చేసిన సురేష్ ఇక పై ప్రతి సినిమాకు నా వంతు సాయం జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here