అనుష్కకు ఛార్మి సూటి ప్రశ్న... పెళ్లెప్పుడు?
on Mar 12, 2020
అనుష్క పెళ్లి విషయంలో ఇటీవల చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఒక క్రికెటర్‌తో ఆవిడ ప్రేమలో ఉందనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతుందనీ వార్తలొచ్చాయి. తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్ళాడుతుందనే గుసగుసలు వినిపించాయి.'బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు?' టైపులో 'అనుష్క పెళ్లెప్పుడు? అనుష్క ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది?' అనేది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఛార్మీ అదే ప్రశ్నఅడిగారు.
హీరోయిన్గా అనుష్క కెరీర్ ప్రారంభమై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం రాత్రి '15 ఇయర్స్ సెలబ్రేషన్స్ అఫ్ అనుష్క' ఈవెంట్ జరిగింది. అందులో అనుష్క మాట్లాడుతుండగా... అతిథిగా హాజరైన ఛార్మి మైక్ అందుకుని 'స్వీటీ, ప్రతిఒక్కరూ ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. పెళ్లి ఎప్పుడు?' అని అడిగారు. "నా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది. పెళ్లి ఎప్పుడు? నాకు తెలియదు. పెళ్లి జరిగినప్పుడు తప్పకుండా అందరికీ తెలుస్తుంది" అని అనుష్క ఆన్సర్ ఇచ్చారు. అనుష్కను 'సూపర్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అయితే... "నాకు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నచ్చదు. ఇలాగే ఉండాలి" అనడం కొసమెరుపు.
Also Read