అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తెలుగు వన్ షార్ట్ ఫిల్మ్
on Nov 16, 2015

బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శిల్పకళా వేదికలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ బాలల చిత్రోత్సవాలలో తెలుగు వన్ రూపొందించిన 'అబ్దుల్' అనే షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ౦లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2 లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రదర్శించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రోత్సవాలలో సినీ ప్రముఖుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



