English | Telugu

NTRకథానాయకుడు... ఊహించని పరాజయమిది!

on Jan 23, 2019

!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ 'యన్.టి.ఆర్ - కథానాయకుడు' సంక్రాంతి కానుకగా విడుదలైంది. తెలుగు ప్రజలు అమితంగా ఆరాధించిన ఎన్టీఆర్ సినీ జీవితం, ఆయన రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రేరేపించిన అంశాల కలబోతతో వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించినట్టు రాలేదు. టాక్‌కి, క‌లెక్ష‌న్ల‌కూ సంబంధ‌మే లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ 20 కోట్ల లోపు కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లు తెలుగు థియేట్రికల్ రైట్స్ 60 కోట్లకు కొన్నట్టు టాక్. కలెక్షన్స్ మరీ తక్కువ రావడంతో ఆల్మోస్ట్ 40 కోట్లు నష్టపోయారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లకు ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. సినిమా కలెక్షన్స్ లో పబ్లిసిటీ ఖర్చులు వగైరా వగైరా తీయగా ఆయనకు వచ్చింది రూ 3.80 కోట్లు. ఆయనకు ఆల్మోస్ట్ 60 పర్సెంట్ రూ 5.80 కోట్లు లాస్ వచ్చింది. ఇండియాలోనూ అమెరికాలోనూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎవరూ ఊహించని పరాజయమిది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here