హైకోర్టులో ఎన్టీఆర్ వెన్నుపోటు....
on Jan 23, 2019
.jpg)
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరవాత ఏం జరిగిందనే విషయాలతో రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తన తండ్రి జీవితాన్ని బాలకృష్ణ గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తుంటే... ఎన్టీఆర్ జీవితంకి వివాదాలను మాత్రమే వర్మ చూపించాలనుకుంటున్నారని నందమూరి, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారంగా ఈ సినిమాకు పలు సమస్యలు చుట్టుముట్టిన్నట్టు భోగట్టా. ఇప్పుడు అధికారికంగా ఈ సినిమాకు ఓ సమస్య వచ్చి పడింది.
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో 'వెన్నుపోటు' పాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందని, ఆయన్ను కించపరిచేలా ఉందని తెలుగుదేశం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకరు హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సెన్సార్ బోర్డు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'వెన్నుపోటు' పాటకు వివరణ ఇవ్వమని ఆదేశించింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా ఉన్న పాటకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. అసలు విషయం ఏంటంటే... ఈ పాటను వర్మ యూట్యూబ్ లో విడుదల చేశారు. అందువల్ల, సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఈ పాటను తొలగించమని అధికారులు చెప్పే అవకాశముంది. వర్మ మాత్రం ఇటువంటి సమస్యలను లెక్క చేయడం లేదు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై గంటకో ట్వీట్, పూటకో కొత్త విషయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



