పర్మిషన్ లేక చిరుని కొట్టలేకపోయిన పవన్!
on Mar 25, 2017
కాటమరాయుడు తొలి రోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయి?? ఖైదీ నెం.150 రికార్డుల్ని బద్దలు కొడుతుందా? లేదా?? అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చేసింది. కాటమరాయుడు తొలి రోజు లెక్కలు బయట పడ్డాయి. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలసి రూ.23 కోట్లు సాధించింది కాటమరాయుడు. పవన్ కల్యాణ్ కెరీర్లో ఇది రికార్డు. అయితే... టాలీవుడ్ రికార్డుని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఇది వరకు ఖైదీ నెం.150 తొలి రోజున రూ.23.68 కోట్లు సాధించింది. కాటమరాయుడు అతి సమీపంలోకి వచ్చి ఆగిపోయింది.
అయినా.. టాలీవుడ్ నెం.2 స్థానాన్ని కైవసం చేసుకొంది. కాటమరాయుడు జోరు చూస్తే ఖైదీ నెం.150 రికార్డుల్ని బద్దలు కొట్టడం ఖాయమనుకొన్నారు. కానీ..హైదరాబాద్లో ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల... ఆ ప్రభావం తొలి రోజు వసూళ్లపై పడింది. దాంతో కాలక్షన్లు కాస్త తగ్గాయి. లేదంటే... ఖైదీ రికార్డు ఎగిరిపోయేదే.