తమ్ముడి కోసం పవన్‌కి దెబ్బేసే ప్రయత్నం
on Mar 25, 2017

తెలుగు సినిమాకి ఉన్న నాలుగు పిల్లర్లలో సురేష్ బాబు ఒకరు. అరకొరగా సినిమాలు నిర్మిస్తున్నా, పంపిణీ దారుడిగా, థియేటర్స్ లీజ్ తీసుకొని నడిపిస్తూ ఏదో రకంగా ఇండస్ట్రీ కి చాలా దగ్గరగా ఉంటున్నారు. తన తమ్ముడు వెంకటేష్ హీరోగా వస్తున్న గురు సినిమాని వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా, నిన్నే విడుదలయిన పవన్ కళ్యాణ్ కాటంరాయుడు పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు మొదలెట్టారు.
తనకి దగ్గరయిన వాళ్ళతో మాట్లాడుతూ కాటమరాయుడు ఎక్కువ రోజులు ఆడలేదని, ఆ సినిమా మొదటి సోమవారం నుండి బలహీన పడుతుందని, వారం లోపు సగం దియెటర్లు ఖాళీ అవుతాయని తన అభిప్రాయం వెళ్లిబుచ్చారంట. ఇది నిజంగా తన అభిప్రాయం అయితే ఓకే కానీ, తన తమ్ముడు వెంకటేష్ సినిమా గురు కి దియెటర్లు పెంచుకునే ప్రయత్నం లో భాగం అయితే మాత్రం ఇది ఏమాత్రం సమర్ధనీయం కాదంటున్నారు. ఇదిలా ఉంటే, గోపాల గోపాల సమయంలో పవన్ కళ్యాణ్ కి సురేష్ బాబు కి ఏదో విషయం లో పొరపొచ్చాలు వచ్చాయని వినికిడి. సురేష్ బాబు తన అక్కసు వెలిబుచ్చడానికి అదీ ఓ కారణం అంటున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



